HomeTelugu Newsఓటీటీలో 'ఎఫ్‌3'.. ఎప్పుడంటే..

ఓటీటీలో ‘ఎఫ్‌3’.. ఎప్పుడంటే..

F3 movie streaming netflix
విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించిన చిత్రం ‘ఎఫ్‌3’. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా నటించారు. రాజేంద్రప్రసాద్‌, మురళీ శర్మ, అలీ, సునీల్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం మే 27న విడుదలై మంచి విజయం సాధించింది. డబ్బు చుట్టూ తిరిగే కథకు వెంకీ, వరుణ్‌ల కామెడీ జత కావడంతో ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించింది.

తాజాగా మేకర్స్‌ ఓటీటీలో ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు మూవీ యూనిట్ రెడీ అయ్యింది. జూలై 22 నుంచి ఎఫ్3 చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ట్రిపుల్‌ ది ఫన్‌, ట్రిపుల్‌ ది ఫన్నీ, ట్రిపుల్‌ ది ఫ్రస్ట్రేషన్‌.. జూలై 22న నెట్‌ఫ్లిక్స్‌లో ఎఫ్‌ 3 రిలీజ్ కు రెడీ అయ్యింది’ అంటూ రాసుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu