గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల్లో పాల్గోన్న సునీల్‌!

జ‌క్క‌న్న లాంటి క‌మ‌ర్షియ‌ల్ సూప‌ర్‌హిట్ చిత్రం త‌రువాత వ‌రుస‌గా ఈడు గోల్డ్ ఎహే, క్రాంతి
మాద‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం , ఎన్ శంక‌ర్ నిర్మిస్తున్న చిత్రాల్లో ఫుల్ బిజిగా వున్న హీరో సునీల్
మోతిన‌గ‌ర్ లోని ఓ అపార్ట్‌మెంట్ లో గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల్లో పాల్గోన్నారు. అన్న‌పూర్ణ ఏడేక‌రాల్లో
ఈడు గోల్డ్ ఎహే షూటింగ్ సాంగ్ చిత్రీక‌ర‌ణ లో బిజిగా వున్నా కూడా గ‌ణ‌ప‌తి పై త‌నకున్న
భ‌క్తిని చాటుకున్నారు. అక్క‌డ ఏర్పాటు చేసిన కొన్ని గేమ్ కాంపిటేష‌న్స్ కి పిల్ల‌ల‌కి భ‌హుమ‌తి
ప్ర‌దానం చేశారు. ఈ సంద‌ర్బంగా సునిల్ మాట్లాడుతూ.. ”మ‌నం ఏ ప‌ని మెద‌లు పెట్టాల‌న్నా
వినాయ‌కుడికి పూజ చేసి మెదలు పెడ‌తాం. అలాంటి వినాయ‌కుడి పూజా కార్క‌క్ర‌మంలో
పాల్గోన‌టం చాలా ఆనందంగా వుంది. అలాగే పిల్ల‌ల‌కి నా చేతుల మీదుగా బ‌హుమ‌తి ప్ర‌ధానం
చేశాను. ఇంకా అక్టోబ‌ర్ 7 న ఈడు గోల్డ్ ఏహే చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప‌క్కా ఎంట‌ర్‌టైనింగ్
ఫిల్మ్ అలానే ఆ చిత్రం డేట్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసిన అల్ల‌రి న‌రేష్ కి, రాజ్ త‌రుణ్ కి ధ‌న్య‌వాదాలు..
ఆ గ‌ణ‌ప‌తి బ్లెస్సింగ్స్ అంద‌రికి వుండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు

CLICK HERE!! For the aha Latest Updates