HomeTelugu Trending'ఎఫ్‌ 3': వరుణ్‌ తేజ్‌ బర్త్‌డే స్పెషల్‌ మీడియో

‘ఎఫ్‌ 3’: వరుణ్‌ తేజ్‌ బర్త్‌డే స్పెషల్‌ మీడియో

F3 Movie Team Birthday Wish
నేడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే పలు సర్ప్రైజ్‌లు వచ్చాయి. వరుణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘గని’ సినిమా నుంచి ‘పవర్ ఆఫ్ గని’ పేరుతో ఓ స్పెషల్ వీడియో విడుదలైంది. అలానే ‘ఎఫ్ 3’నుండి ఓ పోస్టర్ అవిష్కరించబడింది. ఈ క్రమంలో వరుణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా ‘ఎఫ్‌ 3’ టీమ్ బర్త్ డే స్పెషల్ వీడియో విడుదల చేసింది.

ఇందులో వరుణ్ తేజ్ తన చేతిలో ఉన్న షూట్ కేసును పక్కకి విసిరేసి.. 2000 రూపాయల నోట్ల కట్టను చేత్తో పట్టుకొని గాలి విసురుకోవడం ఆకట్టుకుంటోంది. సాంగ్ కు సంబంధించిన ఈ వీడియోలో వరుణ్‌ సూటు, బూటు ధరించి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ”ఎఫ్ 3”.. సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.

‘ఎఫ్ 3’ చిత్రంలో వరుణ్ తేజ్ -విక్టరీ వెంకటేష్ హీరోలుగా, తమన్నా భాటియా – మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోనాలి చౌహన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, రఘుబాబు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu