HomeTelugu Big Stories'విలన్‌ ఆఫ్‌ పుష్ప’

‘విలన్‌ ఆఫ్‌ పుష్ప’

Fahadh faasil first look fr
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. పాన్‌ ఇండియా స్థాయిల్లో వస్తున్న రెండు భాగాలుగా విడుదల కానుంది. మలయాళీ విలక్షణ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇందులో విలన్‌గా కనిపించనున్నారు. ఇటీవల ఆయన ఈ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టారు. కాగా ఈ రోజు (శనివారం) ఉదయం ఫహద్‌ లుక్‌ను చిత్రబృందం నెటిజన్లకు పరిచయం చేసింది. ‘విలన్‌ ఆఫ్‌ పుష్ప’ పేరుతో ఫహద్‌ ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేసింది. ఇందులో ఆయన భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ అనే పోలీస్‌ అధికారిగా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుకున్న ఈ సినిమా తొలిభాగాన్ని ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో ఈ ఏడాది క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu