HomeTelugu TrendingFamily Star Teaser: కలియుగ రాముడొచ్చాడు కాకో

Family Star Teaser: కలియుగ రాముడొచ్చాడు కాకో

Family Star Teaser 1
Family Star Teaser: విజయ్ దేవరకొండ- పరుశురాం కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. వీరి కాంబోలో వచ్చిన గీత గోవిందం ఎంతటి హిట్‌ అయిందో ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. ఈ క్రమంలో ఈ సినిమాపై మంచి అంచనా ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలై గ్లింప్స్, నందనందన పాట అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా వచ్చిన టీజర్‌తో మరింత హైప్ పెంచేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

కలియుగ రాముడొచ్చాడు కాకో.. అంటూ ర్యాప్ సాంగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌లో క్లాస్, మాస్ ఆడియెన్స్ మెచ్చే అంశాలెన్నో ఉన్నాయి. ఇంటి బాధ్యతల్ని చూసుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెన్‌లా విజయ్ కనిపించాడు. పెట్రోల్ చుక్క కూడా వేస్ట్ చేయని ఓ సాధారణ యువకుడిగా కనిపించాడు. ఇక చివర్లో మృణాళ్ ఏవండీ అని పిలిచి.. కాలేజ్‌కి వెళ్లాలి డ్రాప్ చేయండి అని అడిగితే.. లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా అని అనడం టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇక ఈ టీజర్‌లో గోపీ సుందర్ ఆర్ఆర్ బాగుంది. కెమెరా వర్క్ రిచ్‌గా ఉంది. చూస్తుంటే ఈ సారి కూడా పరుశురామ్ విజయ్ కాంబో గట్టిగానే హిట్టు కొట్టేలా ఉంది.

ఈ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు బాగానే కనెక్ట్‌ అయ్యేలా ఉంది. చూస్తుంటే ఇది గీత గోవిందంలో రికార్డులను బ్రేక్ చేసేలా ఉంది. దిల్ రాజు నిర్మాణంలో పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ ఇచ్చే సంగీతం మేజర్ అస్సెట్‌ కానుందని తెలుస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 5న రాబోతోన్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu