HomeTelugu Trendingకమలహాసన్‌ బర్త్‌డే.. భారీగా తరలి వ‌చ్చిన ఫ్యాన్స్‌

కమలహాసన్‌ బర్త్‌డే.. భారీగా తరలి వ‌చ్చిన ఫ్యాన్స్‌

Fans Wishes to kamal haasan
నేడు విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ నేత కమలహాసన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా ఆయనకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. కమల్‌ను చూసి, శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ఇంటి వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వారందరికీ అభివాదం చేస్తూ కమలహాసన్ కృతజ్ఞతలు తెలిపారు. కమల్‌ కేవలం న‌టుడిగానే కాకుండా నిర్మాతగా, రచయితగా, రాజకీయ నాయకుడిగాను సత్తా చాటారు. కమల హాసన్ 1954, నవంబరు 7న జన్మించా ఆయన సినీరంగంలోకి ప్రవేశించాక ఎన్నో అవార్డులను అందుకున్నారు. 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు. ప్ర‌స్తుతం బిగ్ బాస్ త‌మిళ సీజ‌న్-4కు వ్యాఖ్యాతగా ఉన్నారు. ‘భార‌తీయుడు-2’ సినిమాలో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu