HomeTelugu Trendingఫారియా అబ్దుల్లా.. లుక్‌ వైరల్‌

ఫారియా అబ్దుల్లా.. లుక్‌ వైరల్‌

Faria abdullah treditional

టాలీవుడ్‌ లో… జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఫారియా అబ్దుల్లా. మొదటి చూపులోనే కుర్రాళ్ళను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో అమ్మడు చేసిన పాత్ర బాగానే క్లిక్కవడంతో ఇండస్ట్రీలో ఆమెకి మంచి క్రేజ్ దక్కింది. అయితే ఈ బ్యూటీ హీరోల హైట్ ను కాస్త డామినేట్ చేస్తూ ఉండడంతో పెద్దగా ఛాన్స్ లు రాలేదు. ఓ స్టార్ హీరో కూడా హైట్ తో డామినేట్ చేస్తుందని ఆమెతో నటించలేనని అన్నాడట. గతంలో అనుష్క కూడా ఇదే తరహాలో ఇబ్బందులను ఎదుర్కొంది.

తాజాగా ఫారియా ఒక లేడి ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా  కోలీవుడ్ డెబ్యూ మూవీ వ‌ల్లి మ‌యిల్  సినిమా పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. చూస్తుంటే ఇదొక డిఫరెంట్ అడ్వెంచర్ ఫిల్మ్ అని అర్ధమవుతోంది. తమిళ డైరెక్టర్‌ సుశీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తానికి పోస్టర్ లో అయితే ఫారియా చాలా అందంగా కనిపిస్తోంది. అలాగే ఫారియా తెలుగులో కూడా ఒక రెండు ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu