HomeTelugu Newsనా తండ్రి నుంచి ప్రాణహాని ఉంది: హీరోయిన్‌

నా తండ్రి నుంచి ప్రాణహాని ఉంది: హీరోయిన్‌

Father tried kill her saysటీవీ టీవీ, సినీ నటి తృప్తి శంఖధార్ (19) తన తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు బరేలీకి చెందిన నటి ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తల్లితో కలిసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

వివరాలను పరిశీలిస్తే..తన ఇష్టానికి వ్యతిరేకంగా వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని తన తండ్రి రామ్ రతన్ శంఖధార్ నిశ్చయించారనీ, తాను నిరాకరించడంతో తనపై హత్యాయత్నం చేశారంటూ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వాపోయారు. తనపై దాడి చేసి కొట్టాడని, తండ్రి నుంచి తమ ప్రాణాలకు ముప్పుందని రక్షణ కల్పించాలని బరేలీ పోలీసులను వేడుకున్నారు. అంతేకాదు తనకిచ్చిన నగదును కూడా తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనలో తమకు ఎటువంటి
లిఖితపూర్వక ఫిర్యాదు రాలేదని, సోషల్ మీడియాలో నటి పోస్ట్ గురించి తెలుసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని బరేలీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు తృప్తి తండ్రి, రియల్ ఎస్టేట్ వ్యాపారి రామ్ రతన్ ఈ ఆరోపణలను ఖండించారు. కాగా టిక్‌టాక్ స్టార్ కిరణ్ హీరోగా తెరకెక్కుతున్న”ఓయ్ ఇడియట్” సినిమాలో హీరోయిన్ గా తృప్తి నటిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu