HomeTelugu Newsతొలిసారి.. కాస్తా ఎగ్జయిటింగ్‌గా ఉంది: రాశిఖన్నా

తొలిసారి.. కాస్తా ఎగ్జయిటింగ్‌గా ఉంది: రాశిఖన్నా

12 2

టాలీవుడ్‌ హీరోయిన్‌ రాశిఖన్నా త‌న అంద‌చందాల‌తో ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. మంచి గాత్రంతోనూ ఆక‌ట్టుకుంటుంది. కొన్ని తెలుగు చిత్రాల్లో పాట‌లు కూడా మెప్పించింది. తాజాగా ఈమె చేసిన ఓ ప‌ని ఆమెకు కాస్త టెన్ష‌న్‌గా అనిపించింద‌ట‌. అదేంటంటే త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’ సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమాలో త‌న పాత్ర కోసం రాశీఖన్నా త‌నే డ‌బ్బింగ్ చెప్పుకుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ డ‌బ్బింగ్ చెబుతున్న ఫొటోను రాశీఖ‌న్నా పోస్ట్ చేసింది. తొలిసారి తాను డ‌బ్బింగ్ చెప్పుకున్నాన‌ని, చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తుంద‌ని చెప్పింది రాశీఖ‌న్నా.

Recent Articles English

Gallery

Recent Articles Telugu