హాట్ మోడల్‌ బాత్‌రూమ్‌లో అనుమానాస్పద మృతి!

అతిలోక సుందరి శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి మృతిచెందడం సంచలనమైంది. ఈ వార్త యావత్ సినీ రంగాన్ని దీగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటే స్థితిలోనే ఇప్పుడు మిస్ యూనివర్స్ ఉరుగ్వే, వరల్డ్ హాట్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫాతిమివ్ డేవిలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మెక్సికోలో నివాసం ఉంటున్న 31 ఏళ్ల ఫాతిమివ్ డేవిలా… ఏప్రిల్ 23న ఓ హోటెల్‌లో దిగింది. కాగా, గురువారం ఆ హోటెల్‌లో బాత్‌రూమ్‌లో ఆమె మృతిచెంది ఉండడాన్ని హోటల్ సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హాట్ మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. మే 2వ తేదీన హోటెల్ గదిలోని బాత్‌రూమ్‌లో ఫాతిమివ్ డేవిలా… చనిపోయి ఉండడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫాతిమివ్ డేవిలా ఆత్మహత్య చేసుకుందా..? ఎవ్వరైనా హత్య చేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో కాలు జారి ప్రాణాలు కోల్పోయిందా? అనే కోణంలోనూ విచారణ చేపట్టారు పోలీసులు.

CLICK HERE!! For the aha Latest Updates