HomeTelugu Trendingదసరా: స్పెషల్‌ పోస్టర్‌ విడుదల

దసరా: స్పెషల్‌ పోస్టర్‌ విడుదల

nani

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన దసరా టీజర్‌తో మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

అయితే నేడు(ఆదివారం)ఫ్రెండ్షిప్‌ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సముద్రఖని, పూర్ణ, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రోషన్ మ్యాథ్యూ, సాయికుమార్, జరీనా వవాబ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu