HomeTelugu Trendingసీతారామం: డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ్‌ ఫస్ట్‌లుక్‌

సీతారామం: డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ్‌ ఫస్ట్‌లుక్‌

gautham menon first look f
మలయాళ యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సీతారామం’. మృణాళినీ ఠాకూర్‌ హీరోయిన్‌గా.. రష్మికా మందన్నా, సుమంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్‌ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాలో లెఫ్టినెంట్‌ రామ్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్‌ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ప్రముఖ డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ పాత్రను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో గౌతమ్‌ ‘మేజర్‌ సెల్వన్‌’గా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన లుక్‌ విడుదల కాగా, సోషల్‌ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu