HomeTelugu Trendingటైగర్‌ నాగేశ్వరావు: గాయత్రి భరద్వాజ్‌ ఫస్ట్‌లుక్‌

టైగర్‌ నాగేశ్వరావు: గాయత్రి భరద్వాజ్‌ ఫస్ట్‌లుక్‌

Gayatri Bhardwaj First Look

మస్‌ మాహారాజ రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరావు’. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు. చాలా కాలం క్రితం స్టూవర్టుపురం దొంగగా అటు పోలీసులకు.. ఇటు ప్రజలకు కునుకుపట్టకుండా చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవితాన్ని ఆధారంగా చేసుకుని నిర్మితమైన సినిమా ఇది.

ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ విడుదలైన అప్‌డేట్స్ అంచనాలను పెంచుతూ వెళ్లాయి. మాస్ యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో, రవితేజ సరసన నుపుర్ సనన్ కథానాయికగా సందడి చేయనుంది. ‘మణి’ అనే మరో ముఖ్యమైన పాత్రలో గాయత్రి భరద్వాజ్ కనిపించనుంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్టులుక్ లో ఆమె గ్రామీణ యువతిగా మనసులను కట్టిపడేస్తోంది.

రేణు దేశాయ్ కీలకమైన పాత్రను పోషించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో అనుపమ్ ఖేర్, నాజర్, ప్రదీప్ రావత్, మురళీ శర్మ, జిషు సేన్ గుప్తా కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. దసరా కానుకగా ఈ నెల 20వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

20231009fr6523a9547e60a

Recent Articles English

Gallery

Recent Articles Telugu