HomeTelugu Newsఆ పాటలో గీతామాధురి!

ఆ పాటలో గీతామాధురి!

టాలీవుడ్ క్రేజీ సింగ‌ర్‌ గీతామాధురి త్వ‌ర‌లో వెండితెర ఆరంగేట్రం చేస్తోందంటూ వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ యంగ్ అండ్ డైన‌మిక్ సింగ‌ర్ న‌టించే ఆ సినిమా ఏది? అన్న ఆస‌క్తి క‌న‌బ‌రిచారంతా. ఏదైతేనేం గీతామాధురి న‌టించిన సినిమా డీటెయిల్స్ వ‌చ్చేశాయి. డైన‌మిక్ సింగ‌ర్ స్టైల్‌ని ఎలివేట్ చేస్తూ కొన్ని స్టిల్స్ రిలీజ్ అయ్యాయి.
 
గీతామాధురి ఎంట్రీ ఇస్తున్న ఆ ఇంట్రెస్టింగ్‌ సినిమా ‘మెట్రో’. ఇటీవ‌లే స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ ఫెంటాస్టిక్ నేరేషన్‌తో తెర‌కెక్కిన చిత్రంగా  ఈ సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ర‌క్తిక‌ట్టించే ఈ చిత్రం తెలుగులోనూ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని ఆయ‌న అన్నారు. అలాంటి క్రేజీ మూవీ ‘మెట్రో’లో ఓ సాంగ్‌లో గీతామాధురి త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నారు. ఎంతో శ్రావ్యంగా సాగే ఈ మెలోడీ పాట‌ను తాను స్వ‌యంగా ఆల‌పించడ‌మే గాకుండా త‌న‌దైన శైలిలో అభిన‌యించారు. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌జ‌నీ తాళ్లూరి మాట్లాడుతూ.. ”అతి త్వ‌ర‌లోనే ‘మెట్రో’ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. గీతామాధురి ఆల‌పించిన ఆ మెలోడీ సాంగ్ సినిమాకి పెద్ద అస్సెట్‌. ఈ ట్యాలెంటెడ్ సింగ‌ర్ స్వ‌యంగా పాడ‌ట‌మే గాకుండా అభిన‌యించారు. ఈ సినిమాలో అన్ని పాట‌లు సంద‌ర్భానుసారం వ‌స్తూ వేటిక‌వే ప్ర‌త్యేకంగా అల‌రిస్తాయి. ఈ రోజు గీతా మాధురికి సంబంధించిన స్టిల్స్ ను  రిలీజ్ చేస్తున్నాం” అన్నారు. 
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu