HomeTelugu Trending'గని' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు గెస్ట్‌గా అల్లుఅర్జున్‌

‘గని’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు గెస్ట్‌గా అల్లుఅర్జున్‌

Ghani Pre Release Event Upd

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. బాక్సింగ్ నేపథ్యంతో ముడిపడిన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాతో సయీ మంజ్రేకర్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది.

తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్నిఫిక్స్‌ చేశారు. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఏప్రిల్ 2వ తేదీన వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

కొంతసేపటి క్రితమే అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. జగపతిబాబు .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నదియా .. నవీన్ చంద్ర ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, తమన్నా స్పెషల్ సాంగ్ హైలైట్ గా నిలవనుంది.

‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ రివ్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu