HomeTelugu Big Storiesమహేష్‌బాబు సోదరుడు రమేష్‌ బాబు కన్నుమూత

మహేష్‌బాబు సోదరుడు రమేష్‌ బాబు కన్నుమూత

Ghattamaneni ramesh babu pa

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రమేష్ బాబు(56) శనివారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు. గతకొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను శనివారం ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి చేరేలోపే కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. రమేశ్‌ బాబు మరణ వార్త తెలియడంతో ఘట్టమనేని అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu