HomeTelugu Big Storiesగదికి రమ్మన్నాడు: ప్రముఖ గాయని

గదికి రమ్మన్నాడు: ప్రముఖ గాయని

ప్రముఖ గాయకుడు కైలాశ్‌ ఖేర్‌ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తున్నారు బాలీవుడ్‌ గాయని సోనా మొహాపాత్ర. ‘మీటూ’ పేరిట నటీమణులు, గాయనీలు తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్న తరుణంలో సోనా తన బాధను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ‘ఒక రోజు కాఫీ షాప్‌ వద్ద నేను కైలాశ్‌ ఖేర్‌ను కలిశాను. ఇద్దరం కలిసి కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. దీని గురించి చర్చించడానికి కలుసుకున్నాం. ఆ సమయంలో నాపై చేతులు వేస్తూ ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అన్నాడు. నేను అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాను.’

7a

‘ఆ తర్వాత కూడా కైలాశ్‌ నన్ను వదల్లేదు. ఢాకాలో ఫ్లైట్‌ దిగగానే నేను నా హోటల్‌ రూంకు వెళుతున్నాను. ఆ సమయంలో కైలాశ్‌ నాకు పలుమార్లు ఫోన్‌ చేశాడు. కానీ నేను లిఫ్ట్‌ చేయలేదు. అప్పుడు షో నిర్వాహకులకు ఫోన్‌ చేసి నా చేత మాట్లాడించమని అడిగేవాడు. ఇక చేసేదేంలేక అతనితో ఫోన్లో మాట్లాడాను. కచేరీ కార్యక్రమాన్ని వదిలేసి తన గదికి రావాలని చెప్పాడు. గతంలో కైలాశ్‌ నా స్టూడియోలో ఎన్నో పాటలు పాడాడు. కానీ అతనికి ఇలాంటి బుద్ధి ఉందని ముందే తెలిసుంటే నా పట్ల ఇలా జరిగి ఉండేది కాదు. ఇంత నీచమైన వ్యక్తి తన ట్విటర్‌ బయోలో తానో సింపుల్‌ వ్యక్తినని రాసుకున్నాడు.’ అని వెల్లడించారు.

సంధ్య మేనన్‌ అనే విలేకరి కూడా కైలాశ్‌పై ఆరోపణలు చేశారు. కైలాశ్‌ తనకు పంపిన సందేశాలను స్క్రీన్‌ షాట్స్‌ తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ స్క్రీన్‌షాట్స్‌ చూసిన కైలాశ్‌ విలేకరికి ట్విటర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. కైలాశ్‌ క్షమాపణలు చెప్పడంపై సోనా స్పందిస్తూ..’ఎంత మంది ఆడవాళ్లకు క్షమాపణలు చెప్తారు కైలాశ్‌? ఇప్పటినుంచే మొదలుపెట్టండి. మీరు అందరికీ సారీ చెప్పేసరికి జీవితకాలం పడుతుంది’ అన్నారు. కైలాశ్‌ తెలుగు సినిమాల్లోనూ ఎన్నో పాటలకు గాత్రం అందించారు. ‘అరుంధతి’ ‘మిర్చి’, ‘గోపాల గోపాల’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’, ‘భరత్‌ అనే నేను’, ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాల్లో పాటలు పాడారు.

7 8

Recent Articles English

Gallery

Recent Articles Telugu