HomeTelugu Big Stories'నా పాట చూడు' పాటకు యువతి డాన్స్‌.. ఆర్ఆర్ఆర్ టీమ్ ఫిదా

‘నా పాట చూడు’ పాటకు యువతి డాన్స్‌.. ఆర్ఆర్ఆర్ టీమ్ ఫిదా

Girl dance to naatu naatu s
ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి తాజాగా విడుద‌లైన ‘నా పాట చూడు.. నా పాట చూడు.. నాటు నాటు’ అనే పాట లిరిక‌ల్ సాంగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. యూట్యూబ్‌లో నెంబ‌ర్ వ‌న్ ట్రెండింగ్‌లో ఉండ‌టంతో పాటు ఆ వీడియోకు విడుద‌లైన రెండు రోజుల‌కే కోటి వ్యూస్ వ‌చ్చాయి.

తాజాగా ఈ పాటకు ఓ అమ్మాయి డాన్స్‌ చేసింది. చేతులు లేకున్నా.. ఏమాత్రం అధైర్య‌ప‌డ‌కుండా.. అచ్చం ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ స్టెప్స్‌ను దింపేసింది. త‌న డ్యాన్స్ వీడియో ట్విట్ట‌ర్‌లో షేర్ అవ‌డంతో ఆ వీడియోను చూసిన ఆర్ఆర్ఆర్ టీమ్ ఆ వీడియోను రీట్వీట్ చేసి సినిమాపై నీకు ఉన్న ప్రేమ‌, గౌర‌వానికి మేము ఫిదా అయిపోయాం అని క్యాప్ష‌న్ పెట్టింది. దీంతో ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు కూడా ఆ అమ్మాయి చేసిన డ్యాన్స్‌ను చూసి ఫిదా అవుతున్నారు. శ‌భాష్ చెల్లెమ్మా.. బాగా చేశావు. నీకు మంచి భ‌విష్య‌త్తు ఉంది. నీకు ఉన్న అంగ‌వైక‌ల్యాన్ని ప‌ట్టించుకోకుండా.. ఎంతో ధైర్యంతో ముందుకు వ‌చ్చి.. సూప‌ర్బ్ డ్యాన్స్ చేశావు అంటూ ప్రశంసిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!