జయలలిత సినిమా టు రాజకీయం!

002
1948 ఫిబ్రవరి 24న కర్నాటక రాష్ట్రంలో మేలుకొటే అనే ప్రాంతంలో జయరాం, వేదవల్లి అనే తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జంటకు జయలలిత జన్మించారు. ఆమెకు మొదట తన అమ్మమ్మ పేరు కోమలవల్లి అని నామకరణం చేశారు. తరువాత స్కూల్ లో జాయిన్ చేయడానికి ఆమె పేరును జయలలితగా మార్చారు. జయలలితకు ఓ సోదరుడు ఉన్నాడు.అతడి పేరు జయకుమార్. జయలలిత తండ్రి లాయర్ గా పని చేసేవారు. ఆమెకు రెండేళ్ల వయసులో తండ్రి మరణించారు. దాంతో జయలలిత తల్లి పిల్లలను తీసుకొని తన చెల్లెలితో కలిసి మద్రాస్ లో నివసించేవారు. తన చెల్లెలో ప్రోత్సాహంతో వేదవల్లి లోకల్ డ్రామా కంపనీలలో నటించేవారు. ఆ తరువాత మెల్లగా తమిళ చిత్రాల్లో నటించడం ఆరంభించారు. దీంతో జలలితకు తన అమ్మమ్మ, తాతయ్యల వద్ద పెరిగింది. చదులో ఆమె చాలా చురుకు. పదవ తరగతిలో గోల్డ్ స్టేట్ అవార్డ్ ను దక్కించుకున్నారు. దాంతో ఆమెకు ప్రభుత్వం స్కాలర్షిప్ ను సైతం ఆఫర్ చేసింది. జయలలిత తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ పలు బాషలను సులువుగా మాట్లాడగలరు. 

చెన్నైలో క్లాసికల్ మ్యూజిక్, వెస్టర్న్ క్లాసికల్ పియానో, క్లాసికల్ డాన్స్ లతో పాటు భరతనాట్యం, మణిపురి, కథక్ కూడా నేర్చుకున్నారు. మొదటగా 1960లో మైలాపూర్ లో రసిక రంజన సభలో ఆమె డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శివాజీ గణేశన్, భవిష్యత్తులో జయలలిత పెద్ద ఫిల్మ్ స్టార్ అవుతుందని కొనియాడారు. జయలలిత తల్లి వేదవల్లి నటి కావడంతో చిన్నప్పటి నుండి జయలలితకు సినిమా వాతావరణం అలవాటు ఉండేది. చైల్డ్ ఆర్టిస్ట్ గా 1961 లో కన్నడ విడుదలయిన శ్రీ శైల మహాత్మే అనే సినిమాలో నటించారు జయలలిత.
 
1965 లో సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించిన ‘వెన్నిర ఆడై’ అనే తమిళ చిత్రంతో సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు జయలలిత. ఆ తరువాత  అక్కినేని నాగేశ్వరావు గారి సరసన ‘మనుషులు మమతలు’ అనే చిత్రంతో తెలుగులో రంగప్రవేశం చేశారు. అలానే 1968 లో హిందీలో ధర్మేంద్ర సరసన ‘ఇజ్జత్’ అనే సినిమా మెరిశారు. ఎం.జి.రామచంద్రన్ తో కలిసి దాదాపు 28 హిట్ సినిమాల్లో నటించారు జయలలిత. 1977 లో ముఖ్యమంత్రిగా పని చేసిన రామచంద్రన్, జయలలిత రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించారని చెబుతారు. 1989లో తమిళనాడు లేసిగ్లేటివ్ అసెంబ్లీ గా జయలలిత ఎలెక్ట్ అయ్యారు. తమిళనాడులో జానకి రామచంద్రన్ తరువాత ముఖ్యమంత్రిగా ఎన్నికైన మహిళ జయలలిత వరుసగా ఆరు సార్లు ముఖ్యమంత్రిగా ఆమె ఎన్నికవడం తమిళనాడు ప్రజలకు ఆమె పట్ల ఉన్న నమ్మకం, అభిమానాన్ని తెలియబరుస్తుంది. మే 19 2016లో ఆమె ముఖ్యమంత్రిగా ఎన్నికైన కొన్ని రోజుల తరువాత ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. 

సెప్టెంబర్ 22వ తేదీన డీ హైడ్రైషన్, జ్వరం సమస్యలతో ఆమె ఆసుపత్రిలో చేరారు. అప్పట్నించి ఆసుపత్రి నుంచి ఆమె కాలు బయటికి పెట్టలేదు. చాలా రోజులు ఆమెకు ఐసీయూలో చికిత్స చేశారు. లండన్, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి నిపుణులైన డాక్టర్లను రప్పించారు. వారి పర్యవేక్షణలో చికిత్స చేశారు. ఇటీవలే ఐసియు నుంచి రూముకు మార్చారు. ఆమె పూర్తిగా కోలుకున్నారని,ఎప్పుడు ఇంటికి వెళ్లాలో ఆమె ఇష్టమని అపోలో చైర్మన్ ప్రకటించారు. ఇంతలో మళ్లీ ఆమెకు గుండెపోటు రావడంతో చెన్నై అపోలో ఆస్పత్రిలోని రూము నుంచి ఐసీయు కు తరలించారు. నిపుణులైన డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స చేస్తున్నట్టు అపోలో ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. అమ్మకు గుండెపోటు వచ్చిందనే వార్త తెలియగానే తమిళనాడు మంత్రులు ఆస్పత్రికి 
చేరుకున్నారు. అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఆస్పత్రిముందు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దీంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జయ ఆరోగ్య పరిస్థితి కోసం ఎదురు చూస్తున్న ఆమె అభిమానులు, తమిళ ప్రజలు ఒక్కసారిగా సంయమనం కోల్పోయారు. అపోలో ఆసుపత్రి వద్ద విధ్వంసానికి దిగారు. 

అందరూ జయలలితకు సంబంధించిన ఎలాంటి చిన్న వార్తకైనా స్పందిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అపోలోలో చికిత్స పొందుతున్న రోగులను తరలిస్తున్నారు. పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, విద్యాసంస్థలు ఇతర అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మూసివేశారు. ప్రజల్లో ఉద్వేగాలు పెరుగుతున్న నేపథ్యంలో జయలలితపై అధికారక ప్రకటన ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు వెనుకంజ వేస్తున్నారు. అసలు జయలలిత పరిస్థితి ఏంటి? అనేదానిపై ఎలాంటి సమాచారం ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు రానివ్వడం లేదు.
 
001

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here