HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌-4లో ఆ నలుగురు బ్యూటీలు .. వైరల్‌

బిగ్‌బాస్‌-4లో ఆ నలుగురు బ్యూటీలు .. వైరల్‌

5b

తెలుగు బిగ్‌‌బాస్ రియాల్టీ షో ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే. ఇప్పటికే 3సీజన్లు పూర్తి చేసుకున్నాయి. బిగ్‌బాస్ సీజన్‌-3 రాహుల్ సిప్లిగంజ్‌, పున‌ర్న‌వి భూపాలం ల‌వ్‌ట్రాక్‌ వైరల్‌ అయింది. రోజూ ఓ సెన్సేష‌న్‌ని క్రి‌యేట్ చేసి నెటిజ‌న్ల‌కు, వీవ‌ర్స్‌కు మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందించింది. ఇప్పడు సీజ‌న్ 4 ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

గ‌డిచిన కొన్ని రోజులుగా బిగ్‌బాస్ సీజ‌న్ 4కు సంబంధించి రోజుకో వార్త సోషల్‌ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. హైద‌రాబాద్‌లో క‌రోనా విస్తరిస్తున్న నేపధ్యంలో డోంట్ కేర్ అంటూనే బిగ్‌బాస్ టీమ్ సీజ‌న్ 4 కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. నాగార్జున‌కు సంబంధించిన అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌ర్స్‌లో సీజ‌న్ 4 కోసం భారీగా బిగ్‌బాస్ హౌస్‌ని ఏర్పాటు చేస్తున్నారు. బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఈ సీజ‌న్ కోసం ఏకంగా న‌లుగురు హాట్ బ్యూటీల‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ అందాల భామలు ఎవరంటే.. శ్ర‌ద్ధాదాస్‌, యామినీ భాస్క‌ర్‌, ప్రియా వ‌డ్ల‌మాని, హంసా నందిని.. ఈ న‌లుగురిని తాజాగా బిగ్‌బాస్ టీమ్ కంటెస్టెంట్‌లుగా ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే త‌రుణ్‌, మంగ్లీ, బిత్తిరి స‌త్తిల‌ని సీజ‌న్ 4 కోసం సెలెక్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్‌లో న‌లుగురు హాట్ బ్యూటీల‌ని ప్ర‌ధాన కంటెస్టెంట్‌లుగా ఎంపిక చేయ‌డంతో బిగ్‌బాస్ రచ్చ ఓ రెంజ్‌లో ఉంటుంది అని బిగ్‌బాస్ అభిమానులు అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu