HomeTelugu Big Storiesవినరో భాగ్యము విష్ణుకథ: గ్లింప్స్ విడుదల

వినరో భాగ్యము విష్ణుకథ: గ్లింప్స్ విడుదల

Glimpse of Vinaro Bhagyamu

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. బన్నీవాసు నిర్మాతగా.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. రేపు కిరణ్ అబ్బవరం పుట్టినరోజు కావడంతో, కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్ ను విడుదల చేశారు. ‘ఏడు వింతల గురించి మాకు తెలియదు .. మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి .. మాది తిరుపతి .. నా పేరు విష్ణు .. ఇంకొన్ని రోజుల్లో మీరంతా చూడబోయేదే నా కథ’ అంటూ హీరో వాయిస్ పై ఈ గ్లింప్స్ ను విడుదల చేశారు.

ఈ సినిమాతో మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కశ్మీర అనే కొత్త హీరోయిన్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఇటు గీతా ఆర్ట్స్ 2 కి .. అటు కిరణ్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu