
Kiran Abbavaram replaces Anand Deverakonda:
విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ తనకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కొత్త డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా బేబీ అనే సినిమాలో నటించాడు ఆనంద్ దేవరకొండ.
చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఒక్కసారిగా ఈ సినిమాతో హీరో హీరోయిన్ల కి పాపులారిటీ కూడా వచ్చేసింది. కల్ట్ సినిమాగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ సాయి రాజేష్ వెంటనే మరొక సినిమాని ప్రకటించారు. అందులో కూడా ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించాల్సి ఉంది.
View this post on Instagram
దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైంది. బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో సినిమా కాబట్టి అప్పట్లో ఆ పోస్టర్ వైరల్ కూడా అయింది. కానీ పోస్టర్ బయటకు వచ్చినా చాలాకాలం గడిచింది కానీ సినిమా మాత్రం ఇంకా ముందుకు వెళ్లడం లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కాస్టింగ్ పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది.
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాల్సిన ఈ సినిమా ఇప్పుడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేతుల్లోకి వెళ్ళింది. ఈ మధ్యనే క సినిమాతో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న కిరణ్ అబ్బవరం సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
హీరోగా కిరణ్ అబ్బవరం ఫైనలైజ్ అయ్యారు కానీ హీరోయిన్ కోసం చిత్ర బృందం ఇంకా వెతుకులాట లోనే ఉంది. మరి కిరణ్ అబ్బవరం సరసన ఈ సినిమాలో ఎవరు నటిస్తారో వేచి చూడాలి.
ALSO READ: OTT లో బ్లాక్ బస్టర్ అందుకున్న Bigg Boss contestant!