HomeTelugu Big Stories'గాడ్‌ఫాదర్‌' ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేస్తుంది

‘గాడ్‌ఫాదర్‌’ ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేస్తుంది

 

GodFather movie update
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్‌ఫాద‌ర్‌’. మోహ‌న్‌రాజా డైరెక్షన్‌లో వస్తున్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉంది. పొలిటికల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్‌లుక్‌ మరియు టీజర్‌ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో బిగ్ అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు.

‘గాడ్‌ఫాద‌ర్’ ఫ‌స్ట్ సింగిల్ విడుదల తేదిని ప్రకటించారు. గాడ్‌ఫాద‌ర్ ఫ‌స్ట్ సింగిల్‌ను సెప్టెంబ‌ర్ 15 సాయంత్రం 4.05 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. అంతేకాకుండా ప్రోమోను ఈ రోజు సాయంత్రం విడుద‌ల చేయ‌నున్నట్లు తెలిపారు. దీంతో పాటు పోస్ట‌ర్‌ కూడా విడుద‌ల చేశారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, సూప‌ర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. స‌ల్మాన్‌ఖాన్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తుండ‌గా స‌త్య‌దేవ్, న‌య‌న‌తార కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu