కూతురు సినిమా ఎంట్రీపై సైఫ్ కామెంట్!

సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ ల కుమార్తె సారా అలీ ఖాన్ సినిమాల్లోకి రాకముందే సెలబ్రిటీ అయిపోయింది. ఆమె గురించి వస్తోన్న ప్రతి వార్త హాట్ టాపిక్ అవుతోంది. ఆమె బాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతేడాది హృతిక్ రోశన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కానుందని వార్తలు వినిపించాయి. కానీ అలా జరగలేదు. కొన్నిరోజులుగా సారా సినీరంగ ప్రవేశం పట్ల తన తండ్రి సైఫ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడని, ఈ రంగుల ప్రపంచంలో తను ఎంతవరకు ఉండగలదని అతడు టెన్షన్ పడుతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై సైఫ్ అలీ ఖాన్ స్పందించాడు.
సారాను సినీరంగ ప్రవేశం దిశగా తన తల్లితో పాటు నేను కూడా ప్రోత్సహిస్తున్నానని అన్నారు. సారా బాలీవుడ్ ఎంట్రీ కోసం నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి పుకార్లు వచ్చినా.. నమ్మవద్దని సూచించాడు.