టాలీవుడ్‌లో విలన్‌గా కెరీర్ ప్రారంభించి.. హీరోగా రాణిస్తున్నాడు గోపీచంద్. మధ్యలో సినిమా ఎంపికలో కొన్ని తప్పులు చేసి తడబడ్డ గోపీచంద్ సీటీమార్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ జయం సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.
‘నా సంపాదన జయంతోనే మొదలైంది. తేజగారి లక్కీ నంబర్ రూ.11 వేలు. అందుకని నాకు పారితోషికం కూడా అంతే ఇచ్చారు. దీని పక్కన ఓ సున్నా కూడా ఉండొచ్చు కదా అనిపించింది. అది నా మొదటి రెమ్యునరేషన్. ఆ డబ్బు తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చాను. ఇక నా జీవితంలో చాలామందికి అప్పిచ్చాను. కానీ కొందరు తిరిగివ్వలేరు. సరే, వాళ్ల పరిస్థితి బాగోలేదేమోలే అని వదిలేస్తానే తప్ప కమర్షియల్‌గా వ్యవహరించి వాళ్ల దగ్గర నుంచి నా డబ్బులు రాబట్టుకోలేదు’ అని గోపీచంద్ చెప్పుకొచ్చాడు.