HomeTelugu Trendingగోపిచంద్‌-శ్రీనువైట్ల కొత్త సినిమా ప్రారంభం

గోపిచంద్‌-శ్రీనువైట్ల కొత్త సినిమా ప్రారంభం

Gopichand next movie start

గోపిచంద్‌ తాజాగా శ్రీనువైట్లతో సినిమా ప్రారంభించాడు. ఒక్కప్పుడు ఫుల్‌ ఫామ్‌లో ఉండే శ్రీనువైట్లకు ఈ మధ్య అంతగా కలిసి రావడం లేదు. ఆ మధ్యన ఢీ సీక్వెల్ అంటూ ప్రకటించినా.. అది కార్య రూపం దాల్చలేదు. ఇక ఎట్టకేలకు మ్యాచో స్టార్‌ను ఒప్పించి ఓ ఫ్యామిలీ కథను చేయబోతున్నాడు.

కేవి గుహన్‌, గోపి మోహన్‌ వంటి స్టార్‌ టెక్నిషియనలు ఈ సినిమాకు పని చేస్తున్నారు. చిత్రాలయం స్టూడియోస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా శనివారం ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ వేడుకకు దర్శకేంద్రడు రాఘవేంద్రరావుతో పాటు మైత్రీ నిర్మాత నవీన్‌ ఎర్నేని గెస్ట్‌లుగా వచ్చారు.

ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్‌ స్టార్ట్‌ చేసి వచ్చే ఏడాది ద్వితియార్థంలో సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu