HomeTelugu Trendingహనుమాన్‌: తేజ సజ్జ పోస్టర్‌ విడుదల

హనుమాన్‌: తేజ సజ్జ పోస్టర్‌ విడుదల

Hanuman movie new poster re
టాలీవుడ్‌ యువ నటుడు తేజ సజ్జ.. ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న లో ‘జాంబిరెడ్డి’ తరువాత వస్తున్న రెండో చిత్రం ‘హనుమాన్’. టైటిల్ ప్రకటించిన దగ్గర నుంచే ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకేత్తిస్తోంది.

ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ ఇటీవలే అయితే రాలేదు. ఈ రోజున తేజ సజ్జ పుట్టినరోజు కావడంతో, ఆయనకి విషెస్ చెబుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. తలపాగా చుట్టి .. ఎద్దులబండిపై వెళుతూ, ఒక గ్రామీణ కుర్రాడిగా ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ మాస్ లుక్ ఆయన ఆకట్టుకుంటున్నాడు.

దసరాకి ఈ సినిమా నుంచి బిగ్ అప్ డేట్ ఉంటుందని ప్రశాంత్ వర్మ మరింత ఆసక్తిని పెంచాడు. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

20220823fr6304815db985d

Recent Articles English

Gallery

Recent Articles Telugu