HomeTelugu Big Stories'హను- మాన్‌' టీజర్‌

‘హను- మాన్‌’ టీజర్‌

HanuMan Teaser
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న చిత్రం ‘హను-మాన్’. ‘జాంబీ రెడ్డి’ వంటి సూపర్ హిట్ తర్వాత ‘హను-మాన్’ మల్టీవర్స్ లో భాగంగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన “హను-మాన్” టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్.. ఇతర ప్రధాన పాత్రల క్యారక్టర్ పోస్టర్లు విశేష స్పందన తెచ్చుకున్నాయి. తాజాగా సినిమా టీజర్ ని మేకర్స్ ఆవిష్కరించారు. ఈ టీజర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది.

చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్‌. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హిందీ తమిళ మలయాళ మరియు కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu