సల్మాన్ ను చూసి నేర్చుకోవాల్సిందే!

హీరోగా క్రేజ్ వస్తే చాలు డబ్బు దానంటదే ఆటోమేటిక్ గా వస్తుంది. చాలా మంది హీరోలు రెమ్యూనరేషన్ పేరిట కోట్లలో డబ్బు తీసుకుంటున్నారు. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ గురించి చెప్పనక్కర్లేదు. రెమ్యూనరేషన్ తో పాటు శాటిలైట్ రైట్స్, యాడ్స్ అంటూ అందరికంటే ఎక్కువ డబ్బునే సంపాదిస్తున్నాడు. ఇప్పుడు తన బిజినెస్ ను మరింత విస్తరిస్తున్నాడు. సల్మాన్ కు తన ట్విట్టర్ అకౌంట్ ను ఉపయోగించి డబ్బు సంపాదించడం బాగా తెలుసు. గతంలో ఈ విధంగా ఆయన చాలానే సంపాదించాడు.

అయితే ఈసారి ట్విట్టర్ ద్వారా సంపాదించిన మొత్తం ఎంతో తెలుసా..? 10 కోట్లు. తాజాగా సల్మాన్ ఓ కళ్ళజోడు కంపనీకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ కంపనీకు చెందిన యాడ్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడానికి సల్మాన్ డిమాండ్ చేసిన డబ్బు 10 కోట్లు. ఒక అప్ లోడ్ కు ఆ రేంజ్ మొత్తం తీసుకోవడం మామూలు విషయం కాదు. సల్మాన్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకున్న ఆ కంపనీ కూడా ఆ మొత్తాన్ని ఇవ్వడానికి వెనుకాడలేదు. మరి సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్ అలాంటిది!