HomeTelugu Trending‘హరిహర వీరమల్లు’ టీజర్‌ అప్పుడేనట!

‘హరిహర వీరమల్లు’ టీజర్‌ అప్పుడేనట!

Hari hara veera mallu tea
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా.. క్రిష్‌ జాగర్లమూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్‌ ఇండియా చిత్రంగా ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే సినిమాకి సంబంధించి టీజర్‌ని పవన్ పుట్టినరోజు పురస్కరించుకొని సెప్టెంబర్‌ 2న విడుదల చేసే ఆలోచనలో ఉందట మూవీ యూనిట్‌. అదే విధంగా హీరోయిన్‌ నిధి అగర్వాల్‌కు సంబంధించి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 17న ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని సైతం విడుదల చేయనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ‘హరిహరి వీరమల్లు’కు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంది. సినిమా షూటింగ్‌ ప్రారంభమై పదిహేను రోజులు షూటింగ్‌ కూడా జరుపుకొంది. తరువాత కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది.

చిత్రానికి ‘ఆక్వామన్’, ‘వార్‌క్రాఫ్ట్’, ‘స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్’ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు గ్రాఫిక్ పనులు పర్యవేక్షించిన బెన్ లాక్ ఈ సినిమాకి VFX బాధ్యతలను చూస్తున్నారు. మొఘలులు, కుతుబ్ షాహిల నేపథ్యంగా ఈ సినిమా సాగుతుంది. బాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ శ్యామ్‌ కౌశల్‌ నేతృత్యంలో ఆ మధ్య పవన్‌పై కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. అర్జున్‌ రాంపాల్‌, జాక్వెలైన్‌ ఫెర్నాండజ్‌, ఆదిత్య మేనన్‌ తదితరలు నటిస్తున్నారు. పూజిత పొన్నాడ ప్రత్యేక గీతంలో నటించనుంది. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండగ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu