HomeTelugu Trending'జెర్సీ' నటుడి పెళ్లి ఫొటో వైరల్‌

‘జెర్సీ’ నటుడి పెళ్లి ఫొటో వైరల్‌

Harish Kalyans wedding pho
కోలీవుడ్‌ యువ నటుడు హరీష్‌ కళ్యాణ్ వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త నర్మద ఉదయ్‌కుమార్‌ను హరీష్ కళ్యాణ్ పెళ్ళి చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున చెన్నైలోని తిరువేర్కుడు జీపీఎస్‌ ప్యాలెస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం వీరి పెళ్ళి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

తెలుగులో ఈయన ఉదయ్‌ కిరణ్‌ హీరోగా నటించిన ‘జై శ్రీరామ్‌’ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. మళ్ళీ చాలా కాలం తర్వాత ‘జెర్సీ’ సినిమా లో నాని కొడుకుగా నటించాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. ఇక ధోని నిర్మించబోయే సినిమాలో కూడా హీరోగా హరీష్‌ కళ్యాణ్‌ ఎంపికైనట్లు సమాచారం. అంతేకాకుండా హరీష్ కళ్యాణ్‌ తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో రన్నర్‌గా నిలిచాడు. అప్పటి నుండి ఈయనకు కోలీవుడ్‌లో మరింత ఫాలోయింగ్‌ పెరిగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu