HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌-6లో సింగర్‌ కపుల్‌..

బిగ్‌బాస్‌-6లో సింగర్‌ కపుల్‌..

Hemachandra and sravana bha

తెలుగు బిగ్‌బాస్ షో-6 సెప్టెంబర్‌ 4 నుంచి ప్రారంభం కానున్నట్లు ఇటివలె స్టార్‌ మా అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో పాల్గొనే కొందరి కంటెస్టెంట్స్‌ పేర్లు తో పాటు ఓజంట పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా విడాకుల రూమర్స్‌తో వార్తల్లో నిలిచిన ఈ స్టార్‌ సింగర్స్‌ బిగ్‌బాస్‌-6లో సందడి చేయబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అవును మీరు అనుకుంటున్నట్టుగానే సింగర్‌ హేమచంద్ర ఆయన భార్య, గాయనీ శ్రావణ భార్గవిలు కంటెస్టెంట్స్‌గా రాబోతున్నట్లు టాక్‌. ఇందుకోసం వారికి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు బిగ్‌బాస్‌ నిర్వహకులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పుదు. ఇక వారు విడాకులు తీసుకుబోతున్నారంటూ వచ్చిన వార్తలను ఈ జంట ఇప్పటికే ఖండిచింది.

Bigg boss 6

అయినప్పటికీ ఈ రూమర్స్‌ ఆగడం లేదు. వారి మధ్య ఏదో జరుగుతుందంటూ శ్రావణ భార్గవి వ్యవహరం పట్ల పరువురు సందేహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కాగా గత 3 సీజన్లుగా తెలుగు బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా చేసిన నాగార్జున ఈ షోకి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇటీవల బిగ్‌బాస్‌కు సంబంధించిన విడుదలైన ప్రోమోకు మంచి స్పందన వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu