త్రివిక్రమ్ తో ఎన్టీఆర్!

ఎన్టీఆర్ తన తదుపరి సినిమా విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాబీ చెప్పిన కథతో సెట్స్ పైకి వెళ్లడానికి ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడు. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించనున్నారు. ఈ నెలలోనే సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ తో చేయబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఎన్టీఆర్ ఈ విషయంలో త్రివిక్రమ్ కు డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ ల కాంబోలో సినిమా ఇప్పటికే రావాల్సివుంది. కానీ చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ చేతులు మారింది. ఎన్టీఆర్ తో కొన్ని కమర్షియల్ యాడ్స్ చేసిన త్రివిక్రమ్ అప్పట్లోనే తనతో సినిమా చేయాలనుకున్నాడు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఎన్టీఆర్, బాబీల సినిమా పూర్తయ్యే సమయానికి త్రివిక్రమ్, పవన్ ల సినిమా షూటింగ్ పూర్తవుతుంది. దీంతో 2017 ఆగస్ట్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల సినిమా పట్టాలెక్కనుంది. ఇప్పటికే త్రివిక్రమ్ కథ కూడా సిద్ధం చేసినట్లు టాక్.