HomeTelugu Trendingమెగాస్టార్ ఎత్తుకున్న ఫొటోను షేర్‌ చేసిన యంగ్ హీరో

మెగాస్టార్ ఎత్తుకున్న ఫొటోను షేర్‌ చేసిన యంగ్ హీరో

2 181991లో విడుదలైన ‘కలికాలం’ సినిమా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టింది. ఈ సినిమాలో చంద్ర మోహన్, జయసుధ, సాయి కుమార్, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ సినిమా 100 రోజుల వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందుకు మెగాస్టార్ చేతుల మీదుగా సాయికుమార్‌కు ఇవ్వాల్సిన షీల్డ్‌ను ఆయన కొడుకు ఆదికి అందించారు.

ఆ సమయంలో ఆదిని చిరు ఎత్తుకున్నారు. తాజాగా ఈ ఫొటోను ఆది తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో షేర్ చేశాడు. ‘డ్యాడ్ తరఫున ‘కలికాలం’ సినిమాకు నేను అవార్డు అందుకున్నాను’ అని పేర్కొన్నాడు. కాగా, ఈ సినిమాకు డైరెక్టర్‌ ముత్యాల సుబ్బయ్య కళావాహిని అవార్డు కూడా అందుకున్నారు.

#majorthrowback #chiranjeevikonidela #kalikalam 100 days function taking the award on behalf of dad.

Posted by Aadi on Monday, May 18, 2020

Recent Articles English

Gallery

Recent Articles Telugu