HomeTelugu Trendingహీరో మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్‌

హీరో మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్‌

Hero Manchu manoj tested co

కరోనా మహహ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు వరుసగా కోవిడ్‌ బారిన పడుతున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

తాజాగా టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌కు కోవిడ్‌ పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ‘నాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన ప్రతి ఒక్కరు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. నా గురించి ఆందోళన అక్కర్లేదు. మీ అందరి ఆశీర్వాదాలతో ఆరోగ్యంగా తిరిగివస్తా. వైద్యులు, న‌ర్సులంద‌రికీ నేను ప్రత్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను’ అని మనోజ్‌ ట్వీట్‌ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu