HomeTelugu Newsసీరియల్‌లో నటించబోతున్న హీరో నితిన్‌

సీరియల్‌లో నటించబోతున్న హీరో నితిన్‌

Hero nithin appear tv seria
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. కృతీ శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఎమ్‌.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో నితిన్‌ గుంటూరు జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌ రెడ్డి పాత్రలో సరికొత్తగా కనిపించనున్నాడు. రాజకీయ నేపథ్యంతో వస్తున్న ఈ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఆగస్టు 12న విడుదల కాబోతోంది.

ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నితిన్‌ ఓ కొత్త ప్రయోగం చెయ్యనున్నట్లుగా తెలుస్తుంది. బుల్లితెర సీరియల్స్‌లో కనిపించి ప్రేక్షకులను తన సినిమా చూడమని అడగనున్నాడట ఈ హీరో. అంటే కొద్ది క్షణాల పాటు సీరియల్‌లో అలా ప్రత్యక్షమై ఇలా మాయమవుతాడన్నమాట. దీనిలో నిజమనేది తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu