HomeTelugu Big Storiesనీలి చిత్రాన్ని తలపిస్తున్న'24 కిస్సెస్' మేకింగ్‌ వీడియో

నీలి చిత్రాన్ని తలపిస్తున్న’24 కిస్సెస్’ మేకింగ్‌ వీడియో

15

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన ’24 కిస్సెస్’ మూవీ రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేసుకోవడంతో ప్రమోషన్స్‌ని వేగవంతం చేస్తూ చిత్రబృందం మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ మేకింగ్ వీడియో లో ముద్దుల ఘటు మరీ ఎక్కువైంది. 3:24 నిమిషాల నిడివితో కిస్సెస్ మేకింగ్ వీడియో అంటూ ఓ హాట్ వీడియో వదిలింది. ఇందులో ముద్దులు తప్ప ఇంకేమీ లేవు. ముద్దు అంటే ఏదో ఇంతకు ముందు మన తెలుగు సినిమాల్లో చూసిన లిప్‌లాక్‌లు కాదు. అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 లాంటి చిత్రాల్లో ముద్దు సన్నివేశాలు ఈ చిత్రం ముందు దిగదుడుపు అంటే అతిశయోక్తి కాదు. కాకపోతే ఆ చిత్రాల్లో ముద్దులతో పాటు కంటెంట్ ఉంది. ఇందులో కేవలం ముద్దే హద్దులు దాటుతుంది.

హెబ్బా పటేల్ ’24 కిస్సెస్’ మేకింగ్ వీడియో లిప్ లాక్ సన్నివేశాలు చూస్తే.. ఓ చిన్న స్థాయి నీలి చిత్రంలాగే ఉంది. ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇవ్వనే ఇచ్చారు. ఇక అడ్డేం ఉంది అనుకున్నారో ఏమో కాని.. విచ్చలవిడి శృంగార సన్నివేశాలకు తెరతీశారు. ఇంటా బయట అని చూడకుండా కింద మీద పడి మరీ తన్మయంలో తేలిపోతూ గాఢ చుంబనంతో రసికానందం పొందుతున్నారు హీరోహీరోయిన్‌. ‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అన్న మూవీ క్యాప్షన్‌కి తగ్గట్టుగానే హెబ్బా పటేల్, అరుణ్ అదిత్‌లు ఒకే టీషర్ట్‌లో దూరి మరీ ముద్దుల్లో పోటీ పడుతున్నారు. ‘మిణుగురులు’ లాంటి అవార్డ్ విన్నింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి సినిమాకి దర్శకుడు. నవంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu