HomeTelugu Trendingభార్యకు కరోనా.. అయినా బర్త్‌డే సెలబ్రెట్‌ చేసిన నితిన్‌ వీడియో వైరల్‌

భార్యకు కరోనా.. అయినా బర్త్‌డే సెలబ్రెట్‌ చేసిన నితిన్‌ వీడియో వైరల్‌

Hero Nitin celebrates his w

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ భార్య‌కు క‌రోనా సోకింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్ లో ఉంటోంది. ఈ విష‌యం తెలుపుతూ నితిన్ ట్వీట్ చేశాడు. కరోనాకి హద్దులు ఉండొచ్చేమో.. కానీ, ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఆయ‌న అన్నాడు. జీవితంలో ఫస్ట్ టైం త‌న భార్య‌ నెగిటివ్ కావాలని కోరుకుంటున్నానని ఆయ‌న పేర్కొన్నాడు.

నితిన్‌ త‌న భార్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప‌లువురితో క‌లిసి కేక్ క‌ట్ చేశాడు. ఆయ‌న కేక్ క‌ట్ చేస్తుండ‌గా ఆయ‌న భార్య కిటికీలోంచి చూసింది. కేక్ కట్ చేసి ఆమెకి చూపిస్తూ నితిన్ కేక్ తిన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నితిన్ త‌న ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu