HomeTelugu Trendingహీరో సచిన్‌ జోషి అరెస్ట్‌

హీరో సచిన్‌ జోషి అరెస్ట్‌

Hero sachin joshi arrested

సినీ నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి వివాదంలో చిక్కుకున్నాడు. టాలీవుడ్‌లో ఒరేయ్‌పండు, జాక్‌పాట్‌, మౌనమేలనోయి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు సచిన్ జోషి.తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు నిన్న రాత్రి సచిన్‌ జోషిని అరెస్ట్‌ చేశారు. గతంలో ప్రముఖ బిజినెస్‌ మ్యాన్‌ విజయ్‌ మాల్యాకు సంబంధించిన బంగ్లాను సచిన్‌ జోషి కొనుగోలు చేశాడు. అయితే.. ఈ వ్యవహరంలో రియల్ ఎస్టేట్ సంస్థ ఓంకార్ గ్రూప్, సచిన్‌ జోషి మధ్య ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈవ్యవహరంలో ఏకంగా 100 కోట్ల మేరకు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు సచిన్‌ జోషి ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో గతంలోనే విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది ఈడీ. కాగా విచారణకు సచిన్ జోషి హాజరు కాకపోవడంతో అధికారులు అరెస్ట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu