HomeTelugu Trendingహీరో శింబుకి అరుదైన గౌరవం

హీరో శింబుకి అరుదైన గౌరవం

Hero simbu confers with an

తమిళ హీరో శింబుకు అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ తమిళనాడులోని ప్రముఖ వేల్స్‌ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ విషయాన్ని శింబు స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ సందర్భంగా తనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన వేల్స్ యూనివర్శిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు. ఈ గౌరవాన్ని తమిళ సినిమాకు, తన తల్లిదం‍డ్రులకు అంకితమిచ్చాడు.

కాగా తన జీవితంలో సినిమా ఉండటానికి వారే కారణమని, అందుకే ఈ గౌరవాన్ని వారిక అంకితమిస్తున్నట్లు చెప్పాడు. అంతేగాక తనని ఇంతవరకు తీసుకువచ్చిన తన అభిమానులకు ఈ సందర్భంగా శింబు ధన్యవాదాలు తెలిపాడు. ఈ కార్యక్రమానికి శింబు తల్లిదండ్రులు టి.రాజేందర్, ఉష కూడా హాజరయ్యారు. దర్శకుడు, నటుడు టి. రాజేందర్‌ కుమారుడిగా బాల నటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన శింబు హీరోగా ఆకట్టుకున్నాడు. అంతేగాక విభిన్న పాత్రలను ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu