వైభవంగా జరిగిన వెంటేశ్‌ కూతురి వివాహం.. ఫొటోలు షేర్‌ చేసిన ఉపాసన

సీనియర్‌ నటుడు విక్టరీ వెంకటేశ్‌ పెద్ద కూతురి వివాహం జైపూర్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఆశ్రిత, వినాయక్‌లు పెళ్లి వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం జరిగిన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను మెగా కోడలు ఉపాసన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

వధూవరులతో పాటు వెంకటేశ్‌ దంపతులతో కలిసి చరణ్ ఉపాసన దిగిన ఫోటో, చరణ్ బెస్ట్ ఫ్రెండ్‌ యంగ్ హీరో రానా తో కలిసి దిగిన ఫోటోలను ఉపాసన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి, ఆశ్రీతలు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకను అత్యంత సన్నిహితుల మధ్యే నిర్వహించిన దగ్గుబాటి ఫ్యామిలీ సినీ ప్రముఖుల కోసం త్వరలో హైదరాబాద్‌లో గ్రాండ్‌ రిసెప‍్షన్‌ ఇవ్వనుందని తెలుస్తోంది.