HomeTelugu Trendingఆదికేశవ: 'హే బుజ్జి బంగారం' సాంగ్‌ విడుదల

ఆదికేశవ: ‘హే బుజ్జి బంగారం’ సాంగ్‌ విడుదల

Hey Bujji Bangaram Lyrical
వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని నాగవంశీ – సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. మొదటిసారిగా పవర్ఫుల్ టైటిల్ తో .. పవర్ఫుల్ పాత్రలో వైష్ణవ్ తేజ్ ఈ సినిమా చేశాడు. ఇంతవరకూ ఆయన చేసిన సినిమాల్లో యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్నది ఇదే.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. ‘హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా .. హే నువ్వు నా సొంతం నచ్చావే మరింతా’ అంటూ ఈ పాట సాగుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, అర్మాన్ మాలిక్ – యామిని ఘంటసాల ఆలపించారు. విదేశాల్లో చిత్రీకరించిన ఈ పాట బీట్ బాగుంది.

మైనింగ్ కి అడ్డుగా ఉందనే ఉద్దేశంతో శివాలయాన్ని కూల్చడానికి విలన్ ప్రయత్నించడం .. అందుకు హీరో అడ్డుపడటమనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. వైష్ణవ్ తేజ్ జోడీగా ఈ సినిమాలో శ్రీలీల కనిపించనుంది. జోజు జార్జ్, అపర్ణ దాస్, రాధిక ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, నవంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu