HomeTelugu Trendingహై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా 'ఘోస్ట్' మూవీ

హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ఘోస్ట్’ మూవీ

Ghost movie
కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో ఘోస్ట్ చిత్రం రూపొందిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఈ మూవీకి శ్రీని దర్శకుడు. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు.

ఘోస్ట్ మూవీలో ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు.

ఘోస్ట్ మూవీని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల చేసేందుక సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. శివరాజ్ కుమార్ గన్ తో సీరియస్ లుక్ తో ఉన్న రిలీజ్ పోస్టర్ ‘ఘోస్ట్’ ఆగమనాన్ని ఘనంగా ప్రకటిస్తోంది. ప్రముఖ రాజకీయ నాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఘోస్ట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పోస్టర్ మీద ఉన్న క్యాప్షన్ “When Shadows Speak… Know The Ghost Is Arriving” అంచనాలు మరింత పెంచేలా ఉంది. ఘోస్ట్ నుండి వచ్చిన కాన్సెప్ట్ మోషన్ పోస్టర్, టీజర్ ల తర్వాత అటు ట్రేడ్ వర్గాల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్ రెండో వారం నుండి దేశవ్యాప్తంగా స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తోంది. సెప్టెంబర్ రెండో వారంలో ట్రైలర్ విడుదల చేయబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu