HomeTelugu Trending'హిట్‌-2' మూవీ టీజర్‌

‘హిట్‌-2’ మూవీ టీజర్‌

HIT 2 Teaser
టాలీవుడ్‌ హీరో నాని నిర్మించిన చిత్రం ‘హిట్ 2’ . ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. శైలేశ్ కొలను డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు. అడివి శేష్ పాత్రను హైలైట్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ టీజర్ లాంచ్ ఈవెంటులో అడివి శేష్ మాట్లాడాడు.

“ఈ స్టేజ్ పై ఒక్కసారిగా నా జర్నీ గుర్తుకు వచ్చింది. హీరోలంతా ఇష్టపడే హీరోను నేను. నేను ‘క్షణం’ సినిమా చేసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కంటే ముందుగానే బన్నీ స్పందించాడు .. పెద్ద లెటర్ రాసి పెట్టాడు. ఆ సమయంలో ఆయన అందించిన సపోర్టును ఎప్పటికీ మరిచిపోలేనిది. ఇక ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ పెట్టుకున్న థియేటర్ మహేశ్ బాబుగారిది. ఆయన ‘క్షణం’ టీజర్ లాంచ్ చేయడమే కాదు .. నాతో ‘మేజర్’ సినిమాను నిర్మించారు” అన్నాడు.

“ఇక నేను అభిమానించే హీరో నాని. నా ‘గూఢచారి’ ట్రైలర్ ను .. ‘ఎవరు’ ట్రైలర్ ను తనే లాంచ్ చేశారు. ఇక ట్రైలర్స్ లాంచ్ చేయడం కాదు .. నీతో ఒక సినిమానే చేస్తాను అంటూ ‘హిట్ 2’ సినిమాను నిర్మించారు. అలా హీరోలందరి సపోర్టు .. ఒక మంచి సినిమా చేయాలనే తపనే నన్ను ఇంతదూరం తీసుకుని వచ్చాయి. మీనాక్షి నటన ఆకట్టుకుంటుంది .. కంటెంట్ పరంగా ఈ సినిమా ప్రతి ఒక్కరినీ భయపెడుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu