HomeTelugu Newsహారర్ కామెడీ థ్రిల్లర్ గా'మాయా మాల్‌'!

హారర్ కామెడీ థ్రిల్లర్ గా’మాయా మాల్‌’!

haa

‘హోరా హోరీ’ ఫేమ్ దిలీప్ హీరోగా గ్రీష్మ ఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వైష్ణ‌వి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘మాయా మాల్‌’. ఇషా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సోనియా, దీక్షాపంత్‌, పృథ్వీ, నాగినీడు త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగణంగా న‌టించారు. గోవింద్ లాలం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని కె.వి.హ‌రికృష్ణ‌, చందు ముప్పాళ్ల‌, న‌ల్లం శ్రీనివాస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న సినిమాను సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా….
చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ… ”ల‌వ్ అండ్ హ‌ర్ర‌ర్ కామెడి థ్రిల్ల‌ర్‌గా రూపొందిన మా మాయా మాల్ చిత్రం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఓ మాల్‌లో ప్ర‌ధానాంశంగా సాగే సినిమా. అవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. గ‌తంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజుగారి బ్యాన‌ర్‌లో ప‌నిచేసిన గోవింద్ లాలం కొత్త కథనంతో ఈ చిత్రాన్ని చక్కగా ఆస‌క్తిక‌రంగా తెరకెక్కించారు. దిలీప్, ఇషా జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో పృథ్వీ, ష‌క‌ల‌క శంక‌ర్‌, తాగుబోతు ర‌మేష్‌ల కామెడి చాలా హైలైట్‌గా నిలుస్తుంది. యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తీక్‌గారు అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. ఈ చిత్రానికి దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్ర‌ఫీ అందింస్తుండ‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు. మంచి టీంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ వినాయ‌క చ‌వితికి ఫస్ట్ లుక్ ను విడుద‌ల చేస్తున్నాం. అలాగే సెప్టెంబ‌ర్ 8న టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. త్వ‌ర‌లోనే సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల చేసి ఈ సెప్టెంబ‌ర్ నెల‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu