హారర్ నేపధ్యంలో ‘చిన్నారి’!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి చేతుల మీదుగా శుక్ర‌వారం ‘చిన్నారి’ టీజ‌ర్ విడుద‌లైంది. ప్ర‌ముఖ క‌న్న‌డ హీరో ఉపేంద్ర స‌తీమ‌ణి ప్రియాంక కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రమిది. బేబి యులీనా పార్థ‌వి, ఐశ్వ‌ర్య‌, మ‌ధుసూద‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రాన్ని కె.ఆర్‌.కె. ప్రొడ‌క్ష‌న్స్, ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె. ర‌వికుమార్‌, ఎం.ఎం.ఆర్ నిర్మిస్తున్నారు. తెలుగు, క‌న్న‌డ‌లో ఏక‌కాలంలో రూపొందిస్తున్నారు. లోహిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. టీజ‌ర్ విడుద‌ల చేసిన అనంత‌రం
మారుతి మాట్లాడుతూ.. ”క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో రూపొందిన ఈ సినిమా టీజ‌ర్‌ను చూశాను. చాలా బావుంది. గ్రిప్పింగ్‌గా, స్టైలిష్‌గా ఉంది. బాగా ఖ‌ర్చు పెట్టి తీశార‌ని అర్థ‌మ‌వుతోంది. డైర‌క్ట‌ర్ కొత్త వ్య‌క్తి అయినా చ‌క్క‌గా డీల్ చేశార‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను” అని అన్నారు.
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. ”నాకు ద‌ర్శ‌కుడిగా తొలి చిత్ర‌మిది. హార‌ర్ జోన‌ర్‌లో చాలా డిఫ‌రెంట్‌గా ట్రై చేశాం. త‌ల్లీకూతురు సెంటిమెంట్ కూడా ఉంటుంది. సినిమా మొత్తం పూర్త‌యింది. న‌వంబ‌ర్‌లో విడుద‌ల కానుంది” అని చెప్పారు.
నిర్మాత‌లు మాట్లాడుతూ.. ”హార‌ర్ చిత్ర‌మిది. చైల్డ్ సెంటిమెంట్‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. గోవా నేప‌థ్యంలో క‌థ జ‌రుగుతుంది. షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. హాలీవుడ్ స్టైల్ టేకింగ్‌, ఆర్ .ఆర్ మెప్పిస్తాయి. న‌వంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేస్తాం” అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here