చింతమనేనికి ఫోన్‌ చేసిన చంద్రబాబు

వైసీపీ అక్రమ కేసులన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి సూచించారు. జైలు నుంచి విడుదలైన చింతమనేనితో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగానే అనేక కేసులు పెట్టారని, ఈ 5 నెలల్లోనే పనిగట్టుకుని ప్రభాకర్పై 11 కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. 9 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం కన్నా అన్యాయం ఇంకోటి లేదని మండిపడ్డారు. టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని చింతమనేనికి చంద్రబాబు ధైర్యం చెప్పారు. సోమవారం పశ్చిమగోదావరి పర్యటనలో కలుద్దామని తెలిపారు.

CLICK HERE!! For the aha Latest Updates