Homeతెలుగు వెర్షన్పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో పరిస్థితేంటి ?

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో పరిస్థితేంటి ?

Rama Krishna Reddy Pinnelli
ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే… పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ప్రస్తుతం ప్రజల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితేంటి ?,  అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం గుంటూరు ఏసీ కళాశాలలో బీకాం మధ్యలోనే ఆపేశారు. రామకృష్ణారెడ్డి కుటుంబ నేపథ్యం లోకి వెళ్తే.. ఆయనది తొలి నుంచి రాజకీయ కుటుంబం. ఆయన బాబాయ్ లక్ష్మా రెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఇతను 1996లో యూత్ కాంగ్రెస్ గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

2006లో వెల్దుర్తి జెడ్పీటీసీ గా ఎన్నికైన రామకృష్ణా రెడ్డి , ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో 2009 లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాచర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2011లో జగన్ స్థాపించిన వైసీపీలో చేరి 2012 ఉప ఎన్నికల్లో తిరిగి మాచర్ల ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. 2014, 2019 లలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుండి ప్రస్తుతం వరకు ప్రభుత్వ విప్ గా వ్యవహరిస్తున్నారు. రామకృష్ణారెడ్డి పల్నాడు ప్రాంతంలో కరడుగట్టిన ఫ్యాక్షన్ రాజకీయ నాయకుల్లో ఒకరు. నిజానికి పల్నాడు ప్రాంతంలో వెలమ దొరలు బలమైన నాయకులుగా ఉండేవారు. 
 
ఐతే, కాలక్రమేణా వెలమ దొరల ప్రభావం తగ్గుతూ రావడం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బాగా కలిసి వచ్చింది. అదృష్టం బాగుండి.. వరుసగా ఆయనే గెలుస్తూ వస్తున్నారు.  ఇంతకీ,  రాజకీయ నాయకుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉందా ?, చూద్దాం రండి. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్లలో ఎదురు లేదు.    
 
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎవరు పోటీగా నిలిచినా  వాళ్ళు అనేక కష్టనష్టాలు భరించాల్సి వస్తోంది.  ముఖ్యంగా 2019 తర్వాత నుంచి మాచెర్ల నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలకు నాయకత్వం వహిస్తున్న వారిని,  అలాగే వారి అనుచరులను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  అంతం చేస్తున్నారు. దీంతో అక్కడి ప్రతిపక్ష నాయకులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రాజకీయాలు మానేశారు. మరోపక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది.  
 
ఇక ఆయన గ్రాఫ్ విషయానికి వస్తే..   పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ ఎదిరించే ధైర్యమే ఎవరికీ లేదు. ఐతే, మాచర్లలో  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందు బలంగా నిలబడాలి అంటే.. వెలమ కులానికి చెందిన వ్యక్తి బరిలోకి దిగాలి. పలనాటి బ్రహ్మనాయుడు వారసత్వం నినాదంతో ముందుకు వస్తే.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోవడం ఖాయం. ఏది ఏమైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu