HomeTelugu Trending8 ప్యాక్స్‌తో హృతిక్‌.. ఫొటోలు వైరల్‌

8 ప్యాక్స్‌తో హృతిక్‌.. ఫొటోలు వైరల్‌

Hrithik roshan with 8 pack
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ న్యూలుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. హృతిక్‌ మంచి హైట్, ఫిజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. తాజాగా ఆయన 8 ప్యాక్ బాడీ ట్రై చేశారు. జిమ్ లో చొక్కా పైకెత్తి తన 8 ప్యాక్ బాడీని చూపిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. 48 ఏళ్ల వయసులో హృతిక్ ఇంత కష్టపడి 8 ప్యాక్ బాడీ తో కనిపించారు. ఈ ఫొటోతో సహ నటులతో పాటు అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

‘సర్.. నాకు రెండు ఆబ్స్ ఇవ్వండి’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘సోమవారం నుంచి నా డైట్ మారుతుంది’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ‘మళ్లీ పాత హృతిక్ తిరిగి వచ్చాడు’ అని మరొకరు ఆయనను ఉత్సాహపరిచారు. అంటూ పలు రకాల కామెంట్స్‌ వస్తున్నాయి. ప్రస్తుతం హృతిక్‌.. దీపికా పదుకొణేతో కలిసి ‘ఫైటర్’ సినిమాలో నటిస్తున్నారు. ఇది 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu