HomeTelugu Trendingలెక్చరర్‌గా పవన్‌ కళ్యాణ్‌!

లెక్చరర్‌గా పవన్‌ కళ్యాణ్‌!

Huge college set for pawan
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాన్‌ రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజ‌కీయాల వ‌ల‌న మూడేళ్లు సినిమాల‌కు దూరంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, సాగ‌ర్ కె చంద్ర డైరెక్షన్‌లో అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలు శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. అయితే క‌రోనా వ‌ల‌న ప్ర‌స్తుతం ఈ చిత్రాల షూటింగ్ వాయిదా ప‌డింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. హ‌రీష్ శంక‌ర్ డైరెక్షన్‌లో త‌న 28వ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే నెల‌లో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా కోసం కళాదర్శకుడు ఆనంద్‌సాయి కాలేజీ సెట్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ కాలేజ్‌ లెక్చరర్‌ పాత్రలో కనిపించనున్నారట. కాలేజ్ నేప‌థ్యంలో రూపొంద‌నున్న ఈ సినిమా ఎక్కువ భాగం ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లోనే జ‌రుగుతుంద‌ట‌. ఇందులో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తారు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu